Chaitanya sunil movie ti chinnodu peddodu

Naga Chaitanya – Sunil movie title Chinnodu-Peddodu,Naga Chaitanya Sunil new movie title Chinnodu-Peddodu, Chaitu-Sunil Became Chinnodu Peddodu,Chinnodu – Peddodu for Chaitu – Sunil film

Naga Chaitanya – Sunil movie title Chinnodu-Peddodu,Naga Chaitanya Sunil new movie title Chinnodu-Peddodu, Chaitu-Sunil Became Chinnodu Peddodu,Chinnodu – Peddodu for Chaitu – Sunil film

Chaitanya-Sunil movie Chinnodu-Peddodu.png

Posted: 03/08/2013 01:11 PM IST
Chaitanya sunil movie ti chinnodu peddodu

suni-chaitanya

టాలీవుడ్ లో మరో మల్టీ స్టారర్ గా నాగచైతన్య – సునీల్ లు జంటగా తమిళ చిత్రం రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘చిన్నోడు-పెద్దోడు ’ అనే టైటిల్ ని పెట్టబోతున్నట్లు సమాచారం. మొదట ఈ చిత్రానికి ‘తడాఖా ’ అనే టైటిల్ పెట్టాలని అనుకున్నా, స్టోరీకి తగ్గట్లు ఫన్ గా ఉండాలని భావించి ఈ సినిమాకు ఈ టైటిల్ ని నాగార్జున ముందు ఉంచారట. దీనికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇదే టైటిల్ ని ఖరారు చేస్తారని అంటున్నారు. కొంచెం కష్టంతో పరిచయమైన పి.కిశోర్‌కుమార్‌ (డాలీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాతలు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ...''ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. ఇందులో సునీల్‌, నాగచైతన్య అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఎప్పుడూ సరదాగా ఉండే ఆ సోదరులు చేసే సందడి ఆకట్టుకొంటుంది''అని తెలిపారు. ప్రస్తుతం వైజాగ్ లో చిత్రం షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  సీతమ్మ వాకింట్లో హీరోల పేర్లను ఆదారంగా చేసుకొని ఈ సినిమా టైటిల్ని ఖరారు చేశారని అంటున్నారు. మరి ఈ చిన్నోడు, పెద్దోడు ఎంత వరకు అలరిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Star on demand live show with lakshmi manchu
Srinuvytla daughters in baadshah movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles